LOADING...
Bollywood : కియారా చేయాల్సిన ప్రాజెక్ట్స్‌ అనీత్ పద్దా ఖాతాలోకి..!
కియారా చేయాల్సిన ప్రాజెక్ట్స్‌ అనీత్ పద్దా ఖాతాలోకి..!

Bollywood : కియారా చేయాల్సిన ప్రాజెక్ట్స్‌ అనీత్ పద్దా ఖాతాలోకి..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం బాలీవుడ్‌లో నయా సెన్సేషన్‌గా నిలుస్తోంది అనీత్ పద్దా. గ‌తేడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సాయియారా సినిమాతో ఆమె ఒక్కసారిగా యూత్ హార్ట్‌థ్రోబ్‌గా మారిపోయింది. సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో అనీత్ పద్దాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్‌లోని పెద్ద నిర్మాణ సంస్థలు ఆమె కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో య‌ష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌కు చెందిన ఈ బ్యూటీని మాడ్డాక్ ఫిల్మ్స్ తమ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి రూపొందుతున్న అప్‌కమింగ్ మూవీ శక్తి శాలినిలో అనీత్ పద్దా లీడ్ రోల్‌లో నటించనుంది.

Details

వచ్చే ఏడాది డిసెంబర్‌కు వాయిదా

నిజానికి ఈ పాత్ర కోసం మొదటగా కియ‌రా అద్వానీను పరిశీలించినట్లు సమాచారం. అయితే కియారా గర్భవతి కావడంతో ఆ పాత్ర చివరికి అనీత్ పద్దాకు వెళ్లింది. దీంతో ఈ ఏడాది చివర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్‌కు వాయిదా పడింది. ఇప్పటివరకు మడాక్ కామెడీ యూనివర్స్‌లో స్త్రీ, స్త్రీ 2 వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో శ్ర‌ద్ధా క‌పూర్‌ ఆధిపత్యం కొనసాగించింది. అయితే ఇప్పుడు అదే యూనివర్స్‌లో వస్తున్న 'శక్తి షాలిని' ద్వారా అనిల్ ప‌ద్దా తన మ్యాజిక్ చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే 'శక్తి షాలిని' మాత్రమే కాకుండా మరో పెద్ద అవకాశాన్ని కూడా అనీత్ పద్దా అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Details

మ‌ధుబాలా జీవిత కథ ఆధారంగా బయోపిక్

లెజెండరీ నటి మ‌ధుబాలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో అనీత్ పద్దా నటించనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలుత ఈ పాత్రకు కియ‌రా అద్వానీ పేరు వినిపించినా, తాజాగా ఆ పాత్ర అనీత్ పద్దా దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త ఫ్రెష్ ఫేస్ కోసం ఆమెను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ బయోపిక్‌ను ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్నారని టాక్. ఇక దర్శకత్వ బాధ్యతలను జస్మీత్ కె రీన్ నిర్వహించే అవకాశముందని సమాచారం.

Advertisement

Details

డార్లింగ్స్ సినిమాతో మంచి గుర్తింపు

ఆమె గతంలో డార్లింగ్స్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ వార్తలన్నీ ప్రస్తుతం కేవలం రూమర్లేనని అనీత్ పద్దా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం మధుబాల లాంటి గొప్ప నటి జీవితాన్ని తెరపై ఆవిష్కరించడం అనీత్ పద్దాకు పెద్ద సవాలే అవుతుంది. కెరీర్ ప్రారంభ దశలోనే ఇంత బలమైన మహిళా పాత్రను ఎంపిక చేసుకుంటున్న 'సైయారా' బ్యూటీ ఆ పాత్రకు న్యాయం చేయగలదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement