LOADING...
Kicha Sudeep: కిచ్చా సుదీప్ కొత్త యాక్షన్ థ్రిల్లర్ 'MARK'.. గ్లింప్స్‌తో అభిమానుల్లో హైప్!

Kicha Sudeep: కిచ్చా సుదీప్ కొత్త యాక్షన్ థ్రిల్లర్ 'MARK'.. గ్లింప్స్‌తో అభిమానుల్లో హైప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రంలో విలన్‌గా నటించి అపారమైన ఆదరణ పొందిన ఆయన, తర్వాత హీరోగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సెప్టెంబర్ 1న 51వ ఏట అడుగుపెట్టిన సుదీప్‌కు అభిమానులు, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుదీప్, ఈ సందర్భంగా తన 47వ సినిమా 'K47' నుంచి ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌తో పాటు చిత్రానికి అధికారికంగా 'MARK' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Details

MARK అనే టైటిల్ ఖరారు

విజయ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంధిల్ త్యాగరాజన్ - అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తాజాగా వచ్చిన గ్లింప్స్‌లో సుదీప్ పాత్రను ఒక్కొక్క లక్షణం ద్వారా పరిచయం చేశారు Mad, Attitude, Ruthless, King అంటూ చూపించగా, చివర్లో అతని అసలు పేరు అజయ్ మార్కండేయ అని వెల్లడించారు. ఆ పేరులోని అక్షరాలను ఆధారంగా తీసుకుని టైటిల్‌ను 'MARK'గా ఖరారు చేశారు. వీడియోలో సుదీప్ పవర్‌ఫుల్ లుక్‌తో దర్శనమివ్వగా, విలన్స్‌తో పోరాడే మాస్ క్యారెక్టర్‌గా కనిపించారు. ఇది పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Details

క్రిస్మస్ కానుకగా రిలీజ్

ఇప్పటికే దాదాపు 60% షూటింగ్ పూర్తయిందని, మిగతా భాగాన్ని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని సుదీప్ తెలిపారు. క్రిస్మస్ పండుగ కానుకగా ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కీలక అప్డేట్ ఇవ్వడం ద్వారా సుదీప్ అభిమానులకు ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలుస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్ట్‌తో పాటు సుదీప్ 'బిల్లా రంగా బాషా' అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు.