LOADING...
SRK : షారుక్ బర్త్‌డే ట్రీట్‌గా 'కింగ్' టీజర్ రిలీజ్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!

SRK : షారుక్ బర్త్‌డే ట్రీట్‌గా 'కింగ్' టీజర్ రిలీజ్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ మరోసారి తన మ్యాజిక్‌ చూపించడానికి రెడీ అవుతున్నాడు. 'జవాన్', 'పఠాన్' వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన కింగ్‌ ఖాన్‌, బాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించాడు. అయితే రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 'డంకీ' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో కొంత విరామం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే, 'జవాన్' సినిమాలో నటనకు గాను షారుక్‌ ఇటీవల జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. అయితే నవంబర్‌ 2 షారుక్‌ ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్‌ డే ఎందుకంటే ఆయన బర్త్‌డే కాబట్టి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అభిమానులు కింగ్‌ ఖాన్‌ బర్త్‌డేను గ్రాండ్‌గా జరుపుకున్నారు.

Details

ఫ్యాన్స్ కు భారీ సర్ప్రైజ్‌ ఇచ్చిన షారుక్ ఖాన్

అయితే ఈసారి అభిమానుల ఆనందాన్ని మరింత పెంచుతూ షారుక్‌ వారికి భారీ సర్ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం షారుక్‌ సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఇంతకాలం ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక షారుక్‌ బర్త్‌డే కానుకగా ఈ సినిమా టైటిల్‌ మరియు టీజర్‌ను విడుదల చేశారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు 'కింగ్‌' (KING) అనే శక్తివంతమైన టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

Details

టీజర్ లోని డైలాగ్ లు ఇవే

"నేను ఎంతమందిని చంపానో నాకు గుర్తు లేదు... వాళ్లు మంచివాళ్లా చెడ్డవాళ్లా అనేది నాకు సంబంధం లేదు. నాకు గుర్తుండేది వాళ్ల కళ్లల్లో భయం మాత్రమే... అదే వారి చివరి శ్వాస. అందుకు కారణం నేనే. వేల హత్యలు చేశాను, ఎన్నో దేశాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాను. ఈ ప్రపంచం నాకు ఇచ్చిన పేరు ఒక్కటే — 'కింగ్‌'. ఈ పవర్‌ఫుల్‌ డైలాగులతో కూడిన టీజర్‌కు సోషల్‌ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. అభిమానులు షారుక్‌ లుక్‌, యాక్షన్‌ ప్రెజెన్స్‌, బీజీఎం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'కింగ్‌' సినిమాతో షారుక్‌ మరోసారి బాక్సాఫీస్‌ను అదరగొట్టడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి.