
This Week Telugu Movies: థియేటర్‌లలో 'కింగ్డమ్', ఓటీటీలో 'తమ్ముడు'.. ఈ వారం రాబోతున్న సినిమాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
'వాడి కోసం అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్' అంటూ మాస్ డైలాగ్‌తో ప్రేక్షకులలో ఆసక్తి రేపుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'కింగ్డమ్'. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి.
Details
చిలిపి దంపతుల కథ 'సార్ మేడమ్'
విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా నటించిన సినిమా సార్ మేడమ్. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించగా, సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. యోగి బాబు, చెంబన్ వినోద్ జోస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ మూవీ, తెలుగులో ఆగస్టు 1న విడుదల కానుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవల నేపథ్యంలో ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించారు.
Details
వాస్తవ ఘటనల ఆధారంగా 'ఉసురే'
నవీన్ డి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఉసురే. టీజై అరుణాచలం, జననీ కునశీలన్ ప్రధాన పాత్రల్లో నటించగా, రాశి కీలక పాత్రలో కనిపించనున్నారు. మౌళి ఎం. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా, ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ నేపథ్యం, వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ప్రేమకథగా ఈ చిత్రం రూపొందినట్టు చిత్ర బృందం చెబుతోంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఇది నచ్చుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Details
ఆలస్యంగా రాబోతున్న 'సన్నాఫ్ సర్దార్ 2'
అజయ్ దేవగణ్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సన్నాఫ్ సర్దార్ 2' విడుదలకు కొన్ని రోజుల ఆలస్యం ఏర్పడింది. జులై 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం, అనివార్య కారణాల వల్ల ఆగస్టు 1కి వాయిదా పడింది. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 'సన్నాఫ్ సర్దార్'కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Details
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్‌లివే
నెట్‌ఫ్లిక్స్ గ్లాస్ హార్ట్ (వెబ్ సిరీస్) - జులై 31 తమ్ముడు (సినిమా) - ఆగస్టు 1 జియో సినిమా హాట్ స్టార్ క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ 2 (సిరీస్) - జులై 29 పతీ పత్నీ ఔర్ పంగా (సిరీస్) - ఆగస్టు 2 యాపిల్ టీవీ చీఫ్ ఆఫ్ వార్ (సిరీస్) - ఆగస్టు 1