Chennai Love Story day 1 collection : 'చెన్నై లవ్ స్టోరీ' తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయిన కలెక్షన్లు..
ఈ వార్తాకథనం ఏంటి
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీప్రియ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్, సాయి రాజేష్, ధీరజ్ సంయుక్తంగా నిర్మించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజే మంచి స్పందనను అందుకుంది. సినిమా విడుదల అనంతరం మొదటి రోజు వసూళ్ల వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
వివరాలు
బాక్సాఫీస్ వద్ద మెరుగైన వసూళ్లు
మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రీమియర్ షోలు, తొలి రోజు సాధించిన కలెక్షన్లను కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.12.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఇక వారాంతం ప్రారంభం కావడంతో శనివారం, ఆదివారం రోజుల్లో ప్రేక్షకుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత మెరుగైన వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.