Page Loader
కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఆసక్తి రేకెత్తిస్తున్న ఎందుకురా బాబు సాంగ్ ప్రోమో 
ఎందుకురా బాబు పాట ప్రోమో విడుదల

కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఆసక్తి రేకెత్తిస్తున్న ఎందుకురా బాబు సాంగ్ ప్రోమో 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 03, 2023
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న రూల్స్ రంజన్ సినిమా నుండి ఎందుకురా బాబు పాట ప్రోమో రిలీజైంది. బార్ లో తాగుబోతుల మధ్య జరిగే చిన్న సన్నివేశంతో ప్రారంభమైన ఈ ప్రోమోలో, ఆడాళ్ళంటే అడ్జస్ట్ మెంట్, మగాళ్ళంటే కాంప్రమైజ్ అనే డైలాగ్ తో కిరణ్ అబ్బవరం పాత్రకు హితబోధ చేస్తున్న హైపర్ ఆది కనిపించారు. ఆ తర్వాత, ఎందుకురా బాబు.. అందని చందమామ కోసం నువ్వు ఆశపడతావు, ఎందుకురా బాబు.. అచ్చం అప్పడమే తనలాగా ఉందని సర్దుకునిపోవు అనే లిరిక్స్ తో ప్రోమో పూర్తయిపోయింది.

Details

రాహుల్ సిప్లిగంజ్ గొంతులోంచి వచ్చిన పాట 

ప్రోమో వీడియోలో హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పూర్తి పాటను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆగస్టు 6వ తేదీన మద్యాహ్నం 1:50గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్, ఎల్వీ రేవంత్ ఈ పాటను ఆలపించారు. సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్ అందించగా, సంగీతాన్ని అమ్రిష్ సమకూర్చారు. స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు రత్నం క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎందుకురా బాబు పాట ప్రోమో విడుదల