KA 11: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ 'K RAMP'.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది 'క' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం 'దిల్ రుబా' విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో 10వ చిత్రంగా రానుంది. శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిల్మ్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
నేడు కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమాను ప్రకటించారు. ఇది ఆయన కెరీర్‌లో 11వ చిత్రం కానుంది.
హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Details
త్వరలోనే మరిన్ని వివరాలు
మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.
రేపు రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
యూనిట్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రానికి 'K RAMP' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రేపు ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.
హాస్య మూవీస్ బ్యానర్‌లో 7వ సినిమాగా ఈ చిత్రం రానుంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.
నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా కోసం భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఇతర వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.