Kiran Abbavaram: 'క' బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ రివీల్!
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ మీద ఉన్నాడు. 'క' సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్, తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో సుజీత్, సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ.50 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కిరణ్ ఈ చిత్రంలో నటకుడిగానే కాకుండా, నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండటంతో రెమ్యునరేషన్‌తో పాటు లాభాలను కూడా పొందారు. తాజాగా కిరణ్, 'దిల్ రుబా' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మొదట 'క' చిత్రానికి ముందే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
పరిశీలనలో 'K-RAMP' అనే టైటిల్
నూతన దర్శకుడు విశ్వ కరుణ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. 'క' విజయం తర్వాత, ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మారుతి, ఎస్‌కేఎన్ నిర్మాణంలో, కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కిరణ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు ' K-RAMP' అనే టైటిల్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.