
KA 11 : 'కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం 'K'RAMP
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో భారీ విజయాన్ని "క" సినిమాతో అందుకున్నాడు. ఈ చిత్రం అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదే ఉత్సాహంతో ముందుకు సాగేందుకు, ఆయన తదుపరి సినిమా "దిల్ రుబా" షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి,ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాడు." దిల్ రుబా" కిరణ్ కెరీర్‌లో 10వ సినిమా కానుంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ సంస్థ సారెగమ తమ నిర్మాణ శాఖ అయిన 'ఏ యూడ్లీ ఫిలిం'తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తున్నాడు కొత్త దర్శకుడు విశ్వ కరుణ్. ఇదిలా ఉండగా,నేడు కిరణ్ అబ్బవరం తన 11వ సినిమాను అధికారికంగా ప్రకటించాడు.'
వివరాలు
కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో 'K' RAMP
ఈ సినిమా ద్వారా మలయాళ హీరోయిన్ యుక్తి తరేజా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈరోజు రామానాయుడు స్టూడియోలో ఈ కొత్త చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అదే సమయంలో మేకర్స్ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు.ఈ చిత్రానికి 'K' RAMP అనే టైటిల్‌ను ఖరారు చేసి,దీన్ని ప్రకటించేందుకు ఒక చిన్న వీడియోను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రం,కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టును నిర్మాత రాజేష్ దండా నిర్మించనున్నారు. సినిమా సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కిరణ్ అబ్బవరం ' కే ' ర్యాంప్..
కిరణ్ అబ్బవరం ' కే ' ర్యాంప్.. @RealYukthi @JainsNani @RajeshDanda_@HasyaMovies #KRampFirstLook #KRamp pic.twitter.com/PE3LFeEx7S
— తార-సితార (@Tsr1257) June 30, 2025