Prabhas: ప్రభాస్‌తో కిషన్‌రెడ్డి భేటీ.. 'నషాముక్త్ భారత్' పోస్టర్ ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న 'నషాముక్త్ భారత్' కార్యక్రమంలో భాగస్వామి కావాలని ప్రభాస్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
వివరాలు
హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు కార్యక్రమం
ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో 'నషాముక్త్ భారత్' కార్యక్రమం జరగనుంది.
డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించడంతో పాటు ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను భాగస్వాములను చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ఆయన స్వయంగా కలిసి ఆహ్వానించారు.
సినీ ప్రముఖులకు కిషన్‌రెడ్డి ఆహ్వానం
ప్రభాస్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దర్శకుడు సుకుమార్, బోయపాటి శ్రీను, విక్టరీ వెంకటేశ్‌లను కూడా కిషన్‌రెడ్డి కలిశారు.
నషాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి మద్దతు ఇవ్వాలని వారిని కోరారు.