KJQ: అమెజాన్ ప్రైమ్‌లోకి 'కేజేక్యూ'.. దర్శకుడు కేకే చివరి సినిమా ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కేజేక్యూ'. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించిన చివరి సినిమా ఇదే. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటిటిలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'కేజేక్యూ' స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ఈ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. మురళీధర్ గౌడ్ కీలక పాత్రలో కనిపించారు.
వివరాలు
కథేంటంటే..
పార్థ అలియాస్ కింగ్ (దీక్షిత్ శెట్టి), జాకీ (శశి ఓదెల) ఇద్దరూ ప్రాణ స్నేహితులు.
పరిస్థితుల కారణంగా చిన్నతనంలోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ.. ఒక్కో మెట్టు ఎదుగుతూ చివరకు హైదరాబాద్‌ను శాసించే స్థాయికి చేరుకుంటారు.
అయితే ఈ ఇద్దరి జీవితాల్లోకి భార్గవి (యుక్తి తరేజా) ప్రవేశించడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. భార్గవిని తొలిచూపులోనే చూసిన పార్థ.. ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు.
అధికార బలంతో ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ అతడి ప్రయత్నం ఫలించదు. దీంతో పార్థ అహం దెబ్బతింటుంది. భార్గవిని చంపాలని నిర్ణయించుకుంటాడు.
వివరాలు
ఆసక్తికరంగా మూవీ
ఇంతలో భార్గవి ప్రేమికుడిగా జాకీ పేరు వార్తల్లోకి వస్తుంది. అంతేకాదు.. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా బయటకు వస్తాయి.
సరిగ్గా అదే సమయంలో పార్థ భార్య ఆత్మహత్య చేసుకుని మరణించడంతో అతడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
మరి ఆ తర్వాత ఏం జరిగింది? భార్గవి అసలు ఎవరు? పార్థ, జాకీ, భార్గవి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అన్నది తెలుసుకోవాలంటే 'కేజేక్యూ' సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే.