LOADING...
Year Ender 2025: 2025లో మ్యూజిక్ మేనియా: సరిహద్దులు దాటి వైరల్ అయిన సినిమా పాటలు ఇవే..
సరిహద్దులు దాటి వైరల్ అయిన సినిమా పాటలు ఇవే..

Year Ender 2025: 2025లో మ్యూజిక్ మేనియా: సరిహద్దులు దాటి వైరల్ అయిన సినిమా పాటలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

2025 సంవత్సరం సినిమా సంగీత రంగంలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. పెద్ద హీరోల సినిమాల నుంచి వచ్చిన పాటలే కాదు, చిన్న చిత్రాల నుంచి వచ్చిన మంచి పాటలు కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి. భాష ఏదైనా సరే, కొన్ని పాటల మ్యూజిక్‌-తో పాటు హుక్ స్టెప్పులు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో పాటలు నెట్టింట హల్‌చల్ చేశాయి. విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల నుంచి మిలియన్ల వ్యూస్ సాధించిన పాటలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికుల మనసులను దోచుకున్న ఆ పాటలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా..

వివరాలు 

మోనికా పాట 314 మిలియన్ వ్యూస్

ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాల పాటలు సరిహద్దులు దాటి ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్, సంతోష్ నారాయణన్, ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్ వంటి ప్రముఖ సంగీత దర్శకులు అందించిన బాణీలు ఈ ఏడాదిని మరింత ప్రత్యేకంగా మార్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంలోని మోనికా పాట 314 మిలియన్ వ్యూస్‌తో ఈ ఏడాదిలోనే అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. అనిరుధ్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్‌, పూజా హెగ్డే స్టెప్పులు యువతను బాగా ఆకట్టుకున్నాయి. అదే చిత్రంలోని గోల్డెన్ స్పారో సాంగ్ కూడా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో వచ్చిన యేడి పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వివరాలు 

ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సాంగ్స్ ఇవే.. 

అనంతరం సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీలోని కనిమా పాటతో పాటు కన్నడి పూవే సాంగ్ శ్రోతల్ని మంత్రముగ్ధులను చేశాయి. ఇవే కాకుండా తెలుగులో ఏడాది ప్రారంభంలోనే వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్ట పాట సెన్సేషన్‌గా మారింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీలోని జరగండి జరగండి సాంగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దబిడి, నా బంగారు కూన పాటలు మంచి హిట్‌గా నిలిచాయి. మరోవైపు తండేల్ చిత్రంలోని బుజ్జితల్లి పాట, ఓజీ మూవీలోని టైటిల్ సాంగ్ మాత్రం నిజంగా వేరే లెవల్ అని చెప్పాల్సిందే.

Advertisement

వివరాలు 

 సంగీత ప్రియులకు గుర్తుండిపోయే  పాటలను అందించిన 2025

ఈ ఏడాది ఫైర్ స్టార్మ్, సువ్వి సువ్వి పాటలు కూడా ఎక్కువగా వినిపించాయి. ఆంధ్రా కింగ్ సినిమాలోని నువ్వుంటే చాలే, చిన్ని గుండెలో పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. తెలుసు కదా సినిమాలోని నచ్చేసిందే సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. కోర్ట్ మూవీలోని కథలెన్నో చెప్పారు పాట ప్రశంసలు అందుకుంది. అలాగే లిటిల్ హార్ట్స్ చిత్రంలోని హాలో అని సాంగ్ ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయ్యింది. ఇక వైబ్ ఉంది బేబీ, అదిదా సర్‌ప్రైజూ, వైరల్ వయ్యారి వంటి పాటలు మాస్ ఆడియన్స్‌ను అలరించాయి. మొత్తంగా చెప్పాలంటే, 2025 సంవత్సరం సంగీత ప్రియులకు గుర్తుండిపోయే ఎన్నో హిట్ పాటలను అందిస్తూ, సినిమా పాటల శక్తిని మరోసారి నిరూపించింది.

Advertisement