ట్రెండింగ్ లో సమంత గుడి: గతంలో ఎవరెవరు హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టారో తెలుసుకోండి
సినిమా తారలపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. కొందరు పచ్చబొట్టు పొడిపించుకుంటే మరికొందరు సినిమా తారల పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటుంటారు. ఇంకొంతమంది ఏకంగా గుడి కడతారు. ప్రస్తుతం సమంత కోసం గుడి కడుతుండడం వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా ఆలపాడు ప్రాంతానికి చెందిన సందీప్, సమంత కోసం గుడి కడుతున్నాడు. సమంత పుట్టినరోజు (ఏప్రిల్ 28) సందర్భంగా ఈ బహుమతిని అందించాలని అనుకుంటున్నాడట. ఐతే గతంలోనూ హీరోయిన్లకు గుడులు కట్టిన వారున్నారు. ఎవరెవరు హీరోయిన్లకు గుడులు కట్టారో తెలుసుకుందాం. ఖుష్బూ: తమిళనాట ఖుష్బూకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. 90ల్లో ఆమెకు ఆదరణ చాలా ఎక్కువగా ఉండేది. అందుకే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఖుష్బూకు గుడి కట్టించారు.
మూడు గుడులతో టాప్ ప్లేస్ లో ఉన్న నమిత
హన్సిక: దేశముదురుతో తెలుగులో మంచి విజయం అందుకుంది హన్సిక. తమిళంలో ఆమెకు మంచి విజయాలు దక్కాయి. చెన్నైలో హన్సిక కోసం గుడి కట్టించారు ఆమె అభిమానులు. నమిత: సొంతం, జెమిని చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ నమిత. తమిళనాడు రాష్ట్రంలో నమితకు మూడు గుడులు ఉన్నాయి. నగ్మా: 1990ల ప్రాంతంలో నగ్మాకు విపరీతమైన క్రేజ్ ఉండేది. తమిళనాడులో నగ్మాకు గుడి కట్టారు. కానీ అవి ప్రస్తుతం మనుగడలో లేవు. నిధి అగర్వాల్: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో కనిపిస్తున్న నిధి అగర్వాల్ కు చెన్నై నగరంలో ఆమె అభిమానులు గుడి కట్టించారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి