Page Loader
కోటబొమ్మాళి PS: శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మళయాల బ్లాక్ బస్టర్ 

కోటబొమ్మాళి PS: శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మళయాల బ్లాక్ బస్టర్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 31, 2023
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో మళయాలం నుండి తెలుగులోకి ఒక సినిమా రీమేక్ అవుతోంది. మళయాలంలో నయట్టు అనే పేరుతో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం, ఇప్పుడు తెలుగులో కోట బొమ్మాళి PS అనే టైటిల్ తో రూపొందుతోంది. ఈ మేరకు టైటిల్, మోషన్ పోస్టర్ ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ట్విట్టర్ లో ప్రకటించింది. మోషన్ పోస్టర్ లో పరారీలో పోలీసులు అని చూపిస్తూ, సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జోహార్, అర్జున్ ఫల్గున చిత్రాల దర్శకుడు తేజ మర్ని, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గీతా ఆర్ట్స్ ట్వీట్