
Krithi Shetty: ఐటెం సాంగ్ లో చిందులు వెయ్యడానికి రెడీ అయ్యిన కృతి శెట్టి..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి సినిమాతోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అందాల తార, ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకున్నప్పటికీ, అసలు సిసలు హిట్ మాత్రం మిస్ అయింది.
ఏ కారణం చేతనో కానీ,ఆమె నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడం ఆమె కెరీర్‌కు పెద్ద అడ్డంకిగా మారింది.
ప్రస్తుతం ఆమె కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ,టాలీవుడ్‌లో మాత్రం ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయడం లేదు.
ఇటీవల టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న,కానీ పెద్దగా విజయాలు అందుకోలేకపోయిన చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్‌కి ప్రయాణం చేస్తున్నారు.
కొంతమందికి అక్కడ అదృష్టం కలిసి వస్తుంటే, మరికొంత మందికి పెద్దగా గుర్తింపు రాలేదు.
వివరాలు
స్పెషల్ సాంగ్స్ హీరోయిన్స్ కెరీర్‌కు నష్టమే
రష్మిక అక్కడ స్టార్ క్రేజ్‌ను సంపాదించుకోగా,పూజా హెగ్డే మాత్రం ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
తాజాగా కీర్తి సురేష్ కూడా బాలీవుడ్‌లో నిరాశ ఎదుర్కొంది.ఈ నేపథ్యంలో,ఊహించని విధంగా కృతి శెట్టి కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్ దక్కించుకోవడం సంచలనంగా మారింది.
అదీ ఒక ఐటెంసాంగ్ కోసం.సాధారణంగా యంగ్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడం వారి కెరీర్‌కు నష్టమే.
గతంలో చాలామంది హీరోయిన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తమ కెరీర్‌పై ప్రభావం పడిన అనుభవాలు ఉన్నాయి.
ఈపరిస్థితిలో కృతి శెట్టి తీసుకున్నఈనిర్ణయం రిస్క్ అని చెప్పాల్సిందే.పైగా,బాలీవుడ్‌లో ప్రత్యేక గీతాల్లో నటిస్తే భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
అయినా,అన్నీ తెలిసిన కృతి శెట్టి ఈ అవకాశాన్ని ఎలా అంగీకరించింది?అనే ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.