Page Loader
Krithi Shetty : టాలీవుడ్ నుంచి కృతి శెట్టి ఎగ్జిట్..? 'ఖలీఫా' సినిమాతో కొత్త ప్రస్థానం!
టాలీవుడ్ నుంచి కృతి శెట్టి ఎగ్జిట్..? 'ఖలీఫా' సినిమాతో కొత్త ప్రస్థానం!

Krithi Shetty : టాలీవుడ్ నుంచి కృతి శెట్టి ఎగ్జిట్..? 'ఖలీఫా' సినిమాతో కొత్త ప్రస్థానం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఉప్పెన' మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెనలా ప్రవేశించింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకుని, తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ ఆ తరువాత అనూహ్యంగా ఆమె కెరీర్ డౌన్ ట్రాక్‌కి 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మనమే' వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్‌లా నిలిచాయి. దీంతో తెలుగులో అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

Details

కోలీవుడ్ పై పూర్తి ఫోకస్

తనకో కొత్త మలుపే కావాలనుకుని 'జస్ట్ ఫర్ ఛేంజ్' అంటూ మలయాళ పరిశ్రమలో అడుగుపెట్టింది కృతి శెట్టి. ఇప్పుడు ఆమె కోలీవుడ్‌పై కూడా పూర్తి ఫోకస్ పెట్టింది. కానీ తమిళంలో మాత్రం ఎంట్రీ ఆలస్యంగానే జరుగుతోంది. కార్తీతో చేసిన 'వా వాతియార్' సినిమా రిలీజ్ కావాల్సింది, కానీ అది ఇంతవరకు తెరపైకి రాలేదు. ఇక మరో తమిళ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సెప్టెంబర్ 18న విడుదల కానుంది. అలాగే 'జీని' అనే మరో తమిళ చిత్రంలోనూ కృతి నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఖాతాలో మరొక భారీ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చేరట్లు తెలుస్తోంది.

Details

ఖలీఫా సినిమాలో కృతికి అవకాశం

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖలీఫా' సినిమాలో కృతికి అవకాశం దక్కింది. 2022లోనే అనౌన్స్ అయినప్పటికీ, 'వదరరాజ్ మన్నార్' ఇతర కమిట్మెంట్స్ కారణంగా డిలే అయింది. ఇప్పుడు మాత్రం ఈ చిత్రం జూలై నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇండియా, యూకే, దుబాయ్, నేపాల్‌ల్లో షూటింగ్ జరగనుందని టాక్. ఇక ప్రస్తుత లైన్‌అప్ చూస్తే కృతి టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పేస్తుందా అనే చర్చ మొదలైంది. బేబమ్మ తదుపరి సినిమా ఏదో ఆధారంగా ఆమె రాబోయే ప్రణాళికలు ఉంటాయని చెప్పవచ్చు.