తదుపరి వార్తా కథనం

Kumudini Lakhia: కథక్ నృత్యానికి సేవలందించిన కుముదిని లఖియా కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 12, 2025
04:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
కథక్ నృత్యకళకు అంకితమైన ప్రముఖ నర్తకి కుముదిని లఖియా (95) ఇకలేరు. శనివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆమె మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు.
1930లో అహ్మదాబాద్‌లో జన్మించిన కుముదిని, కథక్ నృత్యరూపాన్ని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు అత్యంత కృషి చేశారు. 1967లో ఆమె స్థాపించిన 'కదంబ సెంటర్ ఫర్ డ్యాన్స్' అనే సంస్థ కథక్ అభివృద్ధికి కీలకంగా మారింది.
నూతన ఆవిష్కరణలతో కథక్ నృత్యాన్ని ఆధునిక రూపంలో పరిచయం చేస్తూ, ప్రపంచమంతా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ఆమెదే.
Details
భారత ప్రభుత్వం నుండి పురస్కారాలు
ఆమెకు భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పురస్కారాలు వరుసగా లభించాయి.
ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్న ఆమెను, 2025లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించారు.
కథక్ నృత్యానికి ఆమె చేసిన సేవలు ఎనలేనివని నృత్యప్రపంచం ఆమెకు నివాళులర్పిస్తోంది.