Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. కుప్పం విద్యార్థులు వినూత్న ప్రదర్సన.. వైరల్ అవుతున్న వీడియో
ఏపీ డిప్యూటీ సీఎం,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం (సెప్టెంబర్ 2) తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. పవన్ అభిమానులు అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. సినిమాల పరంగా, పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ "గబ్బర్ సింగ్" సోమవారం థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్లు జరిగాయి.
పవన్ పై కుప్పం కళాకారుడు ప్రత్యేక అభిమానం
పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకునే విషయంలో, చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన కళాకారుడు పురుషోత్తమ్ తన ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించాడు. స్థానిక నోబెల్ స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 800 విద్యార్థులు పవన్ కల్యాణ్ ఫోటోను ప్రతిబింబించేలా సమాహారంగా ఏర్పడి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘట్టానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన అభిమానులు, జనసేన కార్యకర్తలు పురుషోత్తంను అభినందిస్తూ, తమ గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్
ఇక పవన్ పుట్టిన రోజున, ఆయన సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కూడా రావచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన "హరి హర వీర మల్లు", "ఓజీ", "ఉస్తాద్ భగత్ సింగ్" వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాల షూటింగులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కానీ పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో షూటింగులకు బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే పవన్ ఈ సినిమాల షూటింగులకు హాజరవుతాడని నిర్మాతలు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ మూడు సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. కాబట్టి సోమవారం టీజర్స్, పోస్టర్స్ ఏవైనా రిలీజ్ కావచ్చునని అంచనా.