Mad Square: మ్యాడ్ స్క్వేర్ నుంచి మొదటి సాంగ్ విడుదల.. డాన్స్ ఇరగదీసిన సంగీత్ శోభన్
'టిల్లు స్క్వేర్'తో ఘన విజయాన్ని సాధించిన 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' సంస్థ మరో చిత్రాన్ని రూపొందించింది. గత సంవత్సరం విడుదలైన 'మ్యాడ్'కి కొనసాగింపుగా 'మ్యాడ్ స్క్వేర్'ను తెరకెక్కిస్తున్నది. 'మ్యాడ్'లో నటించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఇది ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'లడ్డు గాని పెళ్లి' లిరికల్ సాంగ్
'మ్యాడ్ స్క్వేర్' నుంచి ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్, నేడు తొలి గీతాన్ని విడుదల చేసింది. 'మా లడ్డు గాని పెళ్లి.. ఇగ చూస్కో లొల్లి లొల్లి' అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. మంగ్లీ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. "సాంగ్ మాములుగా లేదుగా" అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 'మ్యాడ్' ఎంత నవ్వులను పంచిందో, ఈ సినిమా రెట్టింపు నవ్వులను తెచ్చే లక్ష్యంతో రూపొందించబడుతోంది.