LOADING...
Prabhas: ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?
Prabhas: ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

Prabhas: ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2024
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

'కల్కి 2898 AD ' సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్ననేపథ్యంలో, ప్రభాస్‌ తన తదుపరి ప్రాజెక్టులకు సన్నద్ధమవుతున్నాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అలాగే, మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'రాజాసాబ్‌' కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూలైలో విడుదల చేసిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది.ప్రభాస్‌ తన రొమాంటిక్‌ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. కాగా,ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్‌ బయటకొచ్చింది.ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌ 23న'రాజాసాబ్‌'టీజర్‌ను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతుంది.ప్రస్తుతం,'రాజాసాబ్‌'చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్‌ తన పార్ట్‌ను ఇప్పటికే పూర్తిచేశాడు,తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌లో ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.