బెల్లంకొండ గణేష్ రెండవ మూవీ నేను స్టూడెంట్ సార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే
ఈ వార్తాకథనం ఏంటి
స్వాతిముత్యం సినిమాతో పరిచయమైన బెల్లంకొండ గణేష్, తన రెండవ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. నేను స్టూడెంట్ సార్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
బెల్లంకొండ గణేష్ కి జోడిగా అవంతిక దాసాని ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది.
ఈ చిత్ర టీజర్ ఆల్రెడీ విడుదలైంది. ఒక మధ్య తరగతి అబ్బాయి ఎంతో కష్టపడి కొనుక్కున్న ఫోన్ ని ఎవరో దొంగిలిస్తారు. ఆ దొంగిలించింది పోలీసులే అని చెప్పి హీరో పాత్ర కంప్లైంట్ చేస్తుంది.
ఆ తర్వాత కథ ఎలా మలుపులు తిరిగిందన్నది సినిమా అని టీజర్ ద్వారా అర్థమైంది. మొన్నటికి మొన్న మాయ మాయ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
నేను స్టూడెంట్ సార్
మార్చ్ 10వ తేదీని విడుదల కానున్న నేను స్టూడెంట్ సార్
నేను స్టూడెంట్ సార్ చిత్రాన్ని మార్చి 10వ తేదీన విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ పోస్టర్ ని కూడా వదిలారు.
సునీల్, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీత అందిస్తున్నారు.
అల్లరి నరేష్ తో నాంది చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయం అందుకున్న నిర్మాత సతీష్ వర్మ, నేను స్టూడెంట్ సర్ చిత్రాన్ని ఎస్ వీ2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ క్రిష్ణ చైతన్య అందించాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు.
స్వాతిముత్యం తో ఫర్వాలేదనిపించుకున్న బెల్లంకొండ గణేష్, నేను స్టూడెంట్ సార్ తో విజయం అందుకుంటాడేమో చూడాలి.