వినరో భాగ్యము విష్ణుకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ప్రకటించిన నిర్మాతలు
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్.. సినిమా మీద మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేశాయి. ఫోన్ నెంబర్ నైబర్ అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తుంది కాబట్టి అందరికీ ఆసక్తిగా ఉంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 7గంటల నుంచి మొదలుకానుంది. ఈ ఈవెంట్ కి అతిధిగా అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ వస్తున్నాడు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ లో పీపుల్స్ ప్లాజా లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.
ఈసారైనా హీరోకు కలిసి వస్తుందా?
కిరణ్ అబ్బవరం కెరీర్ ముందుకు సాగాలంటే ఈ సినిమా విజయవంతం కావడం తప్పనిసరి. ఎందుకంటే ఈమధ్య కిరణ్ నుండి వచ్చిన సినిమాలు దాదాపుగా డిజాస్టర్లుగా మిగిలాయి. దాంతో హీరోగా నిలదొక్కుకోవాలంటే ఒక మంచి హిట్ పడాల్సిన సమయం వచ్చింది. వినరో భాగ్యము విష్ణుకథ సినిమాకు అన్నీ కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ ల సందడి ఎక్కువగా లేకపోవడం, ట్రైలర్ ఆసక్తిగా కనిపించడం, జీఏ 2 ప్రొడక్షన్ బ్యానర్ అడ్వాంటేజ్.. ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా విజయం అందుకుంటాడేమోనని అనిపిస్తుంది. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేశారు, కశ్మీరీ పరదేశి హీరోయిన్ గా నటించగా మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, ఆమని, ఎల్బీ శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.