ప్రభాస్ స్పిరిట్ సినిమా నుండి పక్కకు జరిగిన యూవీ క్రియేషన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కె, స్పిరిట్, రాజా డీలక్స్ మొదలగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు.
అయితే తాజాగా స్పిరిట్ సినిమా నుండి అప్డేట్ వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని గతంలో ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా నుండి యూవీ క్రియేషన్స్ తప్పుకుందని తెలుస్తోంది. కారణాలు ఏంటనేది తెలియదు కానీ యూవీ స్థానంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పుకుంటున్నారు.
Details
హనురాఘవ పూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా
టీ సిరీస్ బ్యానర్ తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్పిరిట్ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చిందని అంటున్నారు. ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభాస్ మరో సినిమాను ఒప్పుకున్నాడని, హను రాఘవపూడి దర్శకత్వంలో ఆ సినిమా ఉండబోతుందని, రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి కథను ఈ సినిమాలో చూపించబోతున్నారని వినిపిస్తోంది.
ఈ పీరియాడిక్ లవ్ స్టోరీని యూవీ క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయని ఫిలింనగర్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
అదలా ఉంచితే, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా కనిపిస్తున్నారు.