Singer Kalpana: సింగర్ కల్పన్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. పరిస్థితి నిలకడగా ఉంది
ఈ వార్తాకథనం ఏంటి
గాయని కల్పన మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్చారు.
ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.
మంగళవారం రాత్రి కల్పనను పరామర్శించేందుకు పలువురు గాయనీగాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు.
సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి వెళ్లి, ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Details
వెంటిలేటర్ పై చికిత్స
హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని తన విల్లాలో నివసిస్తున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి, అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు తెలిపారు.
వెంటనే ఆయన కాలనీ సంఘం ప్రతినిధులను సమాచారమిచ్చారు.
వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి చూడగా, అప్పటికే కల్పన అపస్మారకంగా ఉండిపోయారు.
వెంటనే ఆమెను సమీపంలోని హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.