పెళ్ళికి ముందు కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి: ఫిదా అవుతున్న మెగా అభిమానులు
మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి వేడుక ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఉండనందుని తెలుస్తోంది. అయితే పెళ్లికి ముందు లావణ్య త్రిపాఠి కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. మెగా ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టబోతున్న తరుణంలో తాను చేసే సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాను ఆల్రెడీ ఒప్పుకున్న ఒక తమిళ వెబ్ సిరీస్ నుండి లావణ్య త్రిపాఠి తప్పుకుందని తెలుస్తోంది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో రూపొందునున్న ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయట.
అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇచ్చేసిన లావణ్య త్రిపాఠి
ప్రస్తుతం తాను మెగా ఇంట్లోకి కోడలిగా వెళుతోంది కాబట్టి ఇలాంటి సిరీస్ లలో నటించడం బాగోదని సిరీస్ నిర్మాతలకు చెప్పేసిందట. అంతేకాదు, తాను తీసుకున్న అడ్వాన్సుని వెనక్కి తిరిగి ఇచ్చేసిందని తెలుస్తోంది. మెగా కోడలిగా వెళ్తున్న తరుణంలో బాధ్యతగా ఉండాలన్న ఆలోచనతో లావణ్య త్రిపాఠి, ఈ నిర్ణయం తీసుకున్నారని వినిపిస్తోంది. లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయానికి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కేవలం సిరీస్ మాత్రమే కాదు, సినిమాల విషయంలోనూ లావణ్య త్రిపాఠి కేర్ తీసుకుంటున్నారట. ప్రస్తుతానికి కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదట. మరి పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాల్లో నటిస్తారా లేదా సినిమాలు ఆపేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.