LOADING...
Jolly LLB 3: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి లీగల్ కామెడీ మూవీ 'జాలీ ఎల్ఎల్‌బీ 3'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jolly LLB 3: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి లీగల్ కామెడీ మూవీ 'జాలీ ఎల్ఎల్‌బీ 3'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది హిందీ సినిమా ఇండస్ట్రీలో మంచి హిట్ సాధించిన చిత్రాల్లో 'జాలీ ఎల్ఎల్‌బీ 3' ఒకటి. అక్షయ్ కుమార్‌, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లీగల్ కామెడీ చిత్రం సెప్టెంబర్‌ 19న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేట్రికల్‌ రన్‌ ముగిసిన రెండు నెలలకే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కి సిద్ధమైంది. ముఖ్యంగా ఒకేరోజు రెండు ప్రముఖ ఓటిటి వేదికల్లో విడుదల కావడం విశేషంగా మారింది.

Details

ఓటీటీలోకి 'జాలీ ఎల్ఎల్‌బీ 3'

'జాలీ ఎల్ఎల్‌బీ' ఫ్రాంచైజీలో మూడో భాగంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సుమారు రూ. 170 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ నవంబర్‌ 14వ తేదీ శుక్రవారం డిజిటల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు జియో హాట్‌స్టార్, ఇటు నెట్‌ఫ్లిక్స్ — రెండింటిలో ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో విడుదలైన మొదటి రోజునుంచే ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ లభించింది. మంచి రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోనూ అదే జోష్ కొనసాగిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Details

సినిమా విశేషాలివే

'జాలీ ఎల్ఎల్‌బీ 3'ను దర్శకుడు సుభాష్‌ కపూర్ తెరకెక్కించారు. ఈ సినిమా 2011లో ఉత్తరప్రదేశ్‌లోని రెండు పట్టణాల్లో చోటుచేసుకున్న ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం. ఇంతకు ముందు వచ్చిన 'జాలీ ఎల్ఎల్‌బీ', 'జాలీ ఎల్ఎల్‌బీ 2' సినిమాలు రెండూ మంచి హిట్స్‌గా నిలవడంతో, ఈ మూడో భాగంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్షద్‌ వార్సీ, అక్షయ్‌ కుమార్‌ ఈసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపింది. సౌరభ్‌ శుక్లా, అమృతా రావ్‌, హుమా ఖురేషీ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన 'జాలీ ఎల్ఎల్‌బీ 3', ఇప్పుడు జియో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో ఒకేరోజు అడుగుపెడుతోంది.