
Akhil : టాప్ ట్రెండింగ్‌లో లెనిన్ - 'అయ్యగారి'గా యూట్యూబ్‌ను ఊపేస్తున్న అఖిల్!
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'లెనిన్'కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
అక్కినేని నాగార్జున, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా 'లెనిన్' అనే టైటిల్‌ను ఖరారు చేసి, టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన గ్లింప్స్, సినిమా ఇతివృత్తంపై ఆసక్తిని పెంచింది. లవ్, యాక్షన్, రొమాన్స్, భక్తి అనే నాలుగు ప్రధాన అంశాలను మిళితం చేస్తూ రూపొందించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు బలం చేకూర్చింది.
Details
పవర్ ఫుల్ లుక్ లో అఖిల్
ఇక ఈ టైటిల్ గ్లింప్స్ యూట్యూబ్‌లో ప్రస్తుతానికి టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
అఖిల్‌ను మునుపెన్నడు చూడని స్టైల్, పవర్‌ఫుల్ లుక్‌లో చూడడం అభిమానులను మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె రెండు జడలతో డిఫరెంట్ లుక్‌లో కనిపించింది.
గతంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన అఖిల్, శ్రీలీల.. ఈ సినిమాతో మళ్లీ బౌన్స్‌బ్యాక్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ జంటపై భారీ స్థాయిలో పాజిటివ్ బజ్ నెలకొంది. 'లెనిన్' చిత్రంతో ఇద్దరు నటులకు తిరుగులేని హిట్ ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.