Page Loader
లియో మూవీ ట్విట్టర్ రివ్యూ: దళపతి విజయ్ కొత్త మూవీ ఎలా ఉందంటే? 
లియో మూవీ ట్విట్టర్ రివ్యూ

లియో మూవీ ట్విట్టర్ రివ్యూ: దళపతి విజయ్ కొత్త మూవీ ఎలా ఉందంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 19, 2023
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లియో. రిలీజ్ కి ముందు నుండి ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈరోజు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఆల్రెడీ ఓవర్సీస్ ప్రీమియర్స్ ముందే పడటంతో, టాక్ బయటకు వచ్చేసింది. ఇంతకీ లియో మూవీపై నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం. లియో సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఉందని అంటున్నారు. లియో సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయని, విజయ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ప్రథమార్థంలో విజయ్ సాధారణ వ్యక్తిగా కనిపిస్తాడని, ద్వితియార్థంలో మాత్రం గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టాడని కామెంట్లు చేస్తున్నారు.

Details

ఖైదీతో లియో లింక్ 

లియో సినిమా ఇంటర్వెల్ సినిమా అదిరిపోయిందని, కథ పరంగా లోకేష్ కనగరాజ్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోలేదని, కాకపోతే స్క్రీన్ ప్లే మాత్రం బాగుందని నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఖైదీతో లింక్ చేస్తూ లియో సినిమా సాగిందనీ, అయితే అందరూ అంచనాలు పెట్టుకున్న హైనా సీన్ మాత్రం అంచనాలను అందుకోలేదని అంటున్నారు. హైనాతో ఫైట్ సీన్ గ్రాఫిక్స్ పరంగా మరింత బాగుండాల్సిందని చెబుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే లియో సినిమాపై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. కొంతమంది మాత్రం ఫస్టాఫ్ నెమ్మదిగా నడిచిందని తమ సోషల్ మీడియా ఖాతాల్లో రాసుకొస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లియో మూవీ ట్విట్టర్ రివ్యూ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లియో మూవీ ట్విట్టర్ రివ్యూ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లియో మూవీ ట్విట్టర్ రివ్యూ