LOADING...
Prabhas : ప్రభాస్ మూవీ షూటింగ్‌కు లైన్ క్లియర్.. రెండు పాటలు అక్కడే షూట్
ప్రభాస్ మూవీ షూటింగ్‌కు లైన్ క్లియర్.. రెండు పాటలు అక్కడే షూట్

Prabhas : ప్రభాస్ మూవీ షూటింగ్‌కు లైన్ క్లియర్.. రెండు పాటలు అక్కడే షూట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'ది రాజాసాబ్'పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. షూటింగ్ పూర్తి అయినప్పటికీ, ఇంకా 20 శాతం షూటింగ్ పెండింగ్‌లో ఉంది. అసలు ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ చివరి వరకు షూటింగ్ పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. అయితే టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు సమ్మె ముగియడంతో మళ్లీ షూటింగ్ ప్రారంభానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.

Details

నవంబర్ లో మూవీ ప్రమోషన్లు

రేపటి నుండి రాజాసాబ్ షూటింగ్ మొదలు కానుంది. ఈ నెలాఖరు వరకు అజీజ్ నగర్‌లో ప్రభాస్ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 17 నుండి కేరళలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేయనున్నారు. ఆ తర్వాత గ్రీస్‌లో రెండు పాటల షూటింగ్ జరగనుంది. ఈ పాటల తర్వాత సినిమా షూటింగ్ పూర్తి కానుంది. అక్టోబర్ నెలలో VFX ఫినిషింగ్ పనులు పూర్తి చేయనున్నారు. నవంబర్‌లో ప్రమోషన్లు ప్రారంభించే ప్లాన్ చేశారు. ప్రభాస్ తొలిసారిగా హారర్ జానర్ సినిమాలో కనిపిస్తున్నాడు కాబట్టి, సినిమాపై అభిమానులు మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.