Devara:'దేవర' చూసే వరకూ బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని అవేదన
19 ఏళ్ల యువకుడు కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "దేవర" విడుదలయ్యేలోపు తాను జీవించాలని కోరుకున్నాడు. ప్రస్తుతం అతను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆ యువకుడికి అనారోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. దేవర సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కౌశిక్ ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు. 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్నాడు. కౌశిక్ ప్రస్తుతం బెంగళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
సాయం అందించండి: బాధితుడి తల్లి అవేదన
తన కుమారుడి తీవ్ర వేదనను చూసి, ఆ యువకుడి తల్లి తన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్, జూనియర్ ఎన్టీఆర్‌ను స్పందించాలంటూ బాధితుడి తల్లిదండ్రులు తెలిపారు. "దేవర" సినిమా విడుదల కావడానికి ముందు తమ కుమారుడు జీవితంతో పాటు ఈ చివరి కోరికను కూడా తీర్చాలని బాధిత తల్లి కోరుతోంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంలో సహాయం కోరుతూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేశారు. తన కుమారుడికి అవసరమైన ఖర్చులు కోసం సాయం అందించాలంటూ ఆమె సాయం కోరింది. 9490829381 నంబర్‌కు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా సాయం అందించాలన్నారు. మరన్ని వివరాల కోసం 79956 65169 నంబర్‌ను సంప్రదించాలన్నారు.