LOADING...
Lokah Chapter 1 Chandra: 300కోట్ల క్లబ్ లోకి తొలి మలయాళీ చిత్రంగా కొత్త లోక‌.. 
300కోట్ల క్లబ్ లోకి తొలి మలయాళీ చిత్రంగా కొత్త లోక‌..

Lokah Chapter 1 Chandra: 300కోట్ల క్లబ్ లోకి తొలి మలయాళీ చిత్రంగా కొత్త లోక‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమా అయినప్పటికీ, "కొత్తలోక: చాప్టర్‌ 1" మౌత్‌‑టాక్‌ తో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన నెల రోజులకే ఓటీటీకి వచ్చేస్తున్న తరుణంలో 'కొత్తలోక' మాత్రం ఇంకా థియేటర్‌లోనే ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ₹300 కోట్ల క్లబ్‌లో చేరి, కొత్త రికార్డును సృష్టించింది. ఇదే కాక, అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళీ చిత్రం గా చరిత్రలో నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో డొమినిక్‌ అరుణ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. కేవలం ₹30 కోట్ల బడ్జెట్‌లో తయారైన ఈ సినిమా, విడుదలై 40 రోజుల్లో ₹300 కోట్ల (గ్రాస్‌) వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వివరాలు 

మలయాళ సినిమా రంగంలో రికార్డు స్థాయిలో విజయం 

ఈ ఏడాది విడుదలైన "ఎల్2: ఎంపురాన్" మలయాళంలో అత్యధిక వసూళ్లు (₹265.5 కోట్లు) సాధించిన చిత్రం గా గుర్తింపు పొందింది. కానీ ఆ రికార్డును "కొత్తలోక" సులభంగా అధిగమించింది. ఈ విజయం తర్వాత, ₹242 కోట్లతో "తుడురమ్" మూడవ స్థానంలో ఉంది. డొమినిక్ అరుణ్ రచించిన కథను నమ్మి, ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ పెద్ద సాహసం చేశాడు. 'కొత్తలోక' నటీనటులు, సాంకేతిక వర్గంపై రూ.30 కోట్లు ఖర్చు చేయడం చూస్తే, దుల్కర్ సల్మాన్ ఆ కథను ఎంతగా నమ్మాడో అర్థమవుతుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్రబృందం కష్టపడింది.

వివరాలు 

మౌత్‌ టాక్‌తోనే దూసుకుపోయింది 

కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలకంటే పూర్తి భిన్నంగా కథ, కథనాలు వైవిధ్యంగా ఉండటంతో కేవలం "కొత్తలోక: చాప్టర్‌ 1" మౌత్‌‑టాక్‌ ఆధారంగా మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఇది మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా నిలిచింది. ప్రేక్షకులు ఇప్పుడు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న అంశం: ఈ చిత్రం ఓటీటీపై ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని? అయితే, దీపావళి కానుకగా అక్టోబర్ 20వ తేదీ నుంచి "జియో హాట్‌స్టార్"లో స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

వివరాలు 

"లోక" యూనివర్స్‌ కొనసాగింపు — చాప్టర్‌ 2 

ఇదే తరుణంలో, "లోక" యూనివర్స్‌ను కొనసాగించే ప్లాన్‌ను చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో, "లోక: చాప్టర్‌ 2"ను నిర్మాత దుల్కర్ సల్మాన్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. కొత్త భాగంలో టొవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు.