LOADING...
Lokesh Kanakaraj : హీరోగా లోకేష్ కనకరాజ్.. 'DC' టైటిల్ గ్లిమ్స్ రిలీజ్

Lokesh Kanakaraj : హీరోగా లోకేష్ కనకరాజ్.. 'DC' టైటిల్ గ్లిమ్స్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల సూపర్‌ స్టార్ రజనీకాంత్‌తో చేసిన 'కూలీ' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న లోకేష్, ప్రస్తుతం 'ఖైదీ 2', రజనీ-కమల్ కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాల్సి ఉన్నప్పటికీ, డైరెక్షన్‌కి కొంత విరామం ఇచ్చి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దర్శకత్వం చేస్తూ బోర్ కొట్టిందేమో, ఇప్పుడు నటుడిగా కొత్త సవాలును స్వీకరించాడు. ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' సినిమాను రూపొందించిన అరుణ్ మాతేశ్వరన్ ఈ కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా సినిమా టైటిల్‌తో పాటు గ్లిమ్స్ వీడియో కూడా విడుదల చేశారు.

Details

సంగీతాన్ని అందించనున్న అనిరుధ్

లోకేష్ కనగరాజ్ 'దేవదాస్' పాత్రలో కనిపించబోతున్నాడు.మరోవైపు బాలీవుడ్ నటి వామిక గబ్బి ఈ సినిమాలో 'చందాన' పాత్రలో నటిస్తోంది. హీరో పాత్ర 'దేవదాస్' (D), హీరోయిన్ పాత్ర 'చందాన' (C) మొదటి అక్షరాలను కలిపి చిత్రానికి 'DC' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదల చేసిన గ్లిమ్స్ ప్రకారం, ఇది అవుట్ అండ్ అవుట్ రా రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ సినిమాను కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'సన్ పిక్చర్స్' నిర్మిస్తోంది. ఇందులో కన్నడ భామ రచిత రామ్, తమిళ బ్యూటీ మిర్న మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.