LOADING...
Shilpa Shetty: శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రా దంపతులపై లుకౌట్‌ నోటీసు..!

Shilpa Shetty: శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రా దంపతులపై లుకౌట్‌ నోటీసు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులపై ముంబై పోలీసులు లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ జంటపై ఒక వ్యాపారవేత్తను 60కోట్ల రూపాయల వరకు మోసం చేసిన కేసులో నిందితులుగా నోటీసులు ఇవ్వనున్నారు. గతంలో ఒక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ముంబైలోని వ్యాపారవేత్తను ఈ జంట మొత్తం 60 కోట్ల రూపాయల మోసం చేశారని ఆరోపణలు వచ్చి,కేసు నమోదయింది. ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం శిల్పా-రాజ్ దంపతుల ప్రయాణాల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆ వ్యాపార సంస్థ ఆడిటర్‌ను కూడా విచారించినట్టు సమాచారం. కేసు విచారణ సమయంలో వ్యక్తులు దేశం నుండి పారిపోకుండా చేయడానికి సాధారణంగా లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేస్తారు.

వివరాలు 

 దీపక్‌ కొఠారి వ్యక్తి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు

ఈ కేసులో, ఒప్పందం ద్వారా 60 కోట్ల రూపాయలు మోసం చేశారని దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు, జుహు పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 14న కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు విచారణ కొనసాగుతుండగా, శిల్పా శెట్టి,రాజ్ కుంద్రా తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని, అందుకే లుక్‌ఔట్ నోటీసులు జారీ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి శుక్రవారం తెలిపారు.