Renu Desai: శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లే.. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణు దేశాయ్!
ఈ వార్తాకథనం ఏంటి
నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా, పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితం, ఎదుర్కొంటున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సందర్భంగా తన జీవితంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''తెలుగు వాళ్లందరికీ ఒక విషయం చెప్పాలి. 'బద్రి' సినిమాతోనే నా జీవితం మొదలైందని చాలామంది అనుకుంటున్నారు. అంతకుముందు నాకు ఎలాంటి జీవితమే లేనట్టుగా చూస్తున్నారు.
వివరాలు
మాకు విడాకులు జరిగి 14 ఏళ్లు గడిచిపోయాయి
మాకు విడాకులు జరిగి 14 ఏళ్లు గడిచిపోయాయి. శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం చేశాడు. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుందని రేణు దేశాయ్ ప్రశ్నించారు.
విడాకుల తర్వాత తాను సాధించిన విజయాల గురించి కూడా ఆమె వివరించారు. ''2012లో విడాకులు మంజూరైన తర్వాత ఒక మరాఠీ సినిమాను నిర్మించాను. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
మరో సినిమాకు కథ రాసి, నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాను. డ్యాన్స్ షోల కోసం కూడా పనిచేశాను. కవితలు రాశాను. ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నాను.
వివరాలు
ప్రత్యేకమైన గుర్తింపు లేదు
నాకంటూ ప్రత్యేకమైన వ్యక్తిగత గుర్తింపు లేకపోతే నాకు ఈ అవకాశాలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పైనా రేణు దేశాయ్ స్పందించారు.
''నేను ఒక కుక్కను కాపాడినా నన్ను తిడుతున్నారు. ఆయన లేకపోతే ఆమెకు జీవించే అర్హతే లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే తనను గుర్తించడం, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.