Page Loader
Love Me : ఆశిష్ రెడ్డి,వైష్ణవి చైతన్య లవ్ మీ విడుదల తేదీ ఖరారు 
ఆశిష్ రెడ్డి,వైష్ణవి చైతన్య లవ్ మీ విడుదల తేదీ ఖరారు

Love Me : ఆశిష్ రెడ్డి,వైష్ణవి చైతన్య లవ్ మీ విడుదల తేదీ ఖరారు 

వ్రాసిన వారు Stalin
Mar 24, 2024
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్ రాజు మేనల్లుడు,ఆశిష్ రెడ్డి,"బేబి" సెన్సేషన్ వైష్ణవి చైతన్య కలయికలో చేస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ హారర్ థ్రిల్లర్ చిత్రం "లవ్ మి". ఈ చిత్రానికి నూతన దర్శకుడిగా అరుణ్ భీమవరపు పరిచయమవుతున్నారు. పోస్టర్,టీజర్ లతో మంచి ఆసక్తిని రేపిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ సాలిడ్ లవ్ హారర్ థ్రిల్లర్ ని ఈ ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా మరో బ్యూటిఫుల్ పోస్టర్ తో రివీల్ చేశారు మేకర్స్ . ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి,నాగ మల్లిడి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్ రాజు ప్రొడక్షన్స్ చేసిన ట్వీట్