
Maa Nanna Superhero: 'మా నాన్న సూపర్ హీరో' ఓటీటీలోకి వచ్చేస్తోందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నవ దళపతి సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి ఇప్పుడు ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది.
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సునీల్ బలుసు నిర్మించగా, ఆర్ణ కథానాయికగా నటించింది.
సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది.
నవంబర్ 15న జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతుండటంతో, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Details
నవంబర్ 15న జీ5లో స్ట్రీమింగ్
సూపర్ హీరో తండ్రులందరూ, ఈ భావోద్వేగ ప్రయాణాన్ని మిస్ అవ్వకుండా చూడండి అని జీ5 పోస్ట్ చేసింది.
నవంబర్ 15న జీ5లో ప్రీమియర్ కానున్న ఈ చిత్రం కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగంతో దర్శకుడు అభిలాష్ రెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జీ5లో నవంబర్ 15 నుంచి
An ode to all the superhero dads 🦸♂️
— ZEE5 Telugu (@ZEE5Telugu) November 11, 2024
Watch the beautiful & emotional journey of a son. Don’t miss the digital premiere of #MaaNannaSuperheroOnZee5
Pro Tip: Watch it with family#MaaNannaSuperhero Premieres on 15th November @Zee5Global @isudheerbabu @SayajiShinde #SaiChand pic.twitter.com/quuKMr9n2L