MAA : ప్రభాస్ జోకరంటూ అర్షద్ వ్యాఖ్యలు.. ఖండించిన 'మా' అసోసియేషన్
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి ఇటీవల ప్రభాస్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు స్పందించారు. తాజాగా వీటిని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఖండించింది. వీటిని ఖండిస్తూ ముంబయిలోని మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ప్రతి వ్యక్తికి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందని, అయితే ప్రభాస్‌ను అర్షద్ తక్కువ చేసినందుకు విచారిస్తున్నామని పేర్కొంది. ఆ వ్యాఖ్యలకు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ విషయంలో మీ మద్దతు కోరుతున్నామని తెలిపింది.