
MAD Review : సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' సినిమా ఎలా ఉందో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
యువ నటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన 'మ్యాడ్' ఎలా ఉందో తెలుసా
చిత్రం : మ్యాడ్,
ప్రధాన తారగణం : నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, గోపికా ఉద్యాన్, అనంతిక సనీల్‌కుమార్, అనుదీప్, విష్ణు, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదిేతరులున్నారు.
మ్యూజిక్ : భీమ్స్ సిసిరోలియో
కాలేజీ నేపథ్యంతో సాగే ఈ సినిమాకు యువ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. యువతకు నచ్చే సన్నివేశాలు ఉండటంతో బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతోంది.
కాలేజీలో చదువులు,విద్యార్థుల నడవడిక, పోటీ ప్రపంచంలో సమస్యలు ఎప్పటికీ క్రేజ్ ఉన్న కథాంశాలే.
హ్యాపీడేస్,కేరింత, 3 ఇడియట్స్ వీటికి నిదర్శనం.మ్యాడ్ కూడా ఇదే కోవకు చెందింది.
DETAILS
వెన్నెలను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏమిటీ ?
మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన స్టూడెంట్స్.
భగవాన్ క్యాంటిన్ విషయంలో బాస్కెట్ బాల్ పోటీలో గెలుపొంది ఫ్రెండ్స్ అవుతారు. మనోజ్ శృతి (గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్ పై ఇష్టం పెంచుకుంటుంది.
దామోదర్ (డీడీ)కి గుర్తు తెలియని అమ్మాయిలాగా లవ్ లెటర్ రాసి తన ప్రేమలో పడేలా చేస్తుంది వెన్నెల.
వెన్నెలను చూడకుండానే రోజూ ఫోన్లో నాలుగేళ్లు మాట్లాడుతుంటారు. వెన్నెలను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏమిటీ ? మధ్యలో లడ్డు(విష్ణు) ఎవరో తెలియాలంటే మాత్రం మ్యాడ్ చూడాల్సిందే.
బలాలు : నటన, హాస్యం , సంభాషణలు
బలహీనతలు : పాటలు, కథ పెద్దగా లేకపోవడం. మొత్తంగా యువతను ఆకట్టుకుంటోంది.
.