
మ్యాడ్ సినిమా నుంచి విడుదలైన మెలోడి పాట.. నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే అంటూ సాగిన సాంగ్
ఈ వార్తాకథనం ఏంటి
'మ్యాడ్' సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే అంటూ ఈ బ్యూటిఫుల్ మెలోడి పాట సాగుతోంది.
హీరో హీరోయిన్లపై ఈ పాటను అందంగా చిత్రీకరించడంతో యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది.
ఈ మేరకు భీమ్స్ సంగీతాన్ని అందించారు. కపిల్ కపిలన్ పాడిన ఈ పాటకి, భాస్కర్ భట్ల సాహిత్యాన్ని అందించారు.
ఈ పాటలో నువ్వు కాస్త కరిగితే ప్రపంచమేమీ మునిగిపోదులే.. నువ్వు పంతం వదిలితే యుగాంతం రాదులే అంటూ భాస్కర భట్ల రాసిన లిరిక్స్ ప్రయోగాత్మకంగా నిలిచాయి.
మరోవైపు నార్నె నితిన్ హీరోగా పరిచయమవుతున్నా మ్యాడ్ మూవీలో సంగీత్ శోభన్-రామ్ నితిన్ నటించారు. అక్టోబర్ 6న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'మ్యాడ్' సినిమా నుంచి రిలీజ్ అయిన మెలోడి సాంగ్
#MAD 2nd single ~ #NuvvuNavvukuntu Vellipomaakey... is here to steal your hearts ❤️😍
— Sithara Entertainments (@SitharaEnts) September 26, 2023
▶️ https://t.co/wVyDyWUu1N
A #BheemsCeciroleo Musical 🎹
🎤 @KapilKapilan_
✍️ @bhaskarabhatla @kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/4SxVqzGGLr