MAD Square : 'మ్యాడ్ స్క్వేర్' టీజర్ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
వినోదాత్మక చిత్రం 'మ్యాడ్' 2023లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందింది.
ప్రేక్షకులను ఆకట్టుకొని, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈ విజయాన్ని కొనసాగిస్తూ 'మ్యాడ్'కి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్'ను రూపొందిస్తున్నట్లు గతేడాది మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
'మ్యాడ్ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, మేకర్స్ టీజర్ విడుదల తేదీని ఖరారు చేశారు.
Details
మార్చి 25న టీజర్ రిలీజ్
'మ్యాడ్ స్క్వేర్' టీజర్‌ను ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్టు అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో మరింత శక్తివంతమైన, ఆకట్టుకునే పాటలు ఉండనున్నాయని తెలుస్తోంది.
మొదటి భాగాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్, సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. 'మ్యాడ్'ని అభిమానించిన ప్రేక్షకులు, 'మ్యాడ్ 2'ను మరింతగా ప్రేమిస్తారని నిర్మాతలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని అందుకోనున్నామని చిత్ర బృందం పేర్కొంటోంది. భారీ అంచనాల మధ్య 'మ్యాడ్ 2' మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.