Loading...
Prahaar : సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని మడాక్ ఫిల్మ్స్‌ ప్లాన్.. యంగ్ హీరోతో కీలక ప్రాజెక్ట్
సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని మడాక్ ఫిల్మ్స్‌ ప్లాన్.. యంగ్ హీరోతో కీలక ప్రాజెక్ట్

Prahaar : సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని మడాక్ ఫిల్మ్స్‌ ప్లాన్.. యంగ్ హీరోతో కీలక ప్రాజెక్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

మడాక్ ఫిల్మ్స్‌ తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఈ బ్యానర్‌ నుంచి భిన్నమైన కథాంశాలతో సినిమాలు రావడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంస్థ అధినేత దినేష్ విజన్‌ కూడా విజనరీ నిర్మాతగా పేరు సంపాదించారు. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ కంటెంట్‌ బేస్డ్ చిత్రాలను నిర్మిస్తూ మడాక్ ఫిల్మ్స్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా హారర్ కామెడీ జానర్‌లోకి ఎంటరైన తర్వాత మడాక్ ఫిల్మ్స్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇక 'ఛావా' సినిమాతో ఆ సంస్థ క్రెడిబిలిటీ మరింత పెరిగింది.

వివరాలు

ఇప్పటివరకూ చెప్పుకొదగ్గ హిట్ పడలేదు

అయితే ఆ తర్వాత 'భూల్ చుక్ మాఫ్', 'తెహ్రాన్', 'పరమ్ సుందరి' మొదలుకుని.. ఈ ఏడాది వచ్చిన 'కాక్‌టెయిల్ 2' వరకు మడాక్ ఫిల్మ్స్‌కు చెప్పుకోదగ్గ సాలిడ్ సక్సెస్ దక్కలేదు.

మడాక్ ఫిల్మ్స్‌ నుంచి అక్టోబర్‌ నెలలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న 'పూజా మేరీ జాన్' సినిమా ఇప్పటికే ఓటీటీ బాట పట్టింది.

ఇక 'ప్రహార్' సినిమా దసరాను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది.

'ప్రహార్' కథ 2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడుల తర్వాత కొనసాగిన న్యాయ పోరాటం చుట్టూ తిరుగుతుంది.

ఈసినిమాలో ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటిస్తున్నారు. వామికా గబ్బీ కథానాయికగా కనిపించనున్నారు.

వివరాలు

జూన్ నాటికి చిత్రీకరణ పూర్తి

'ప్రహార్' తర్వాత కూడా మడాక్ ఫిల్మ్స్‌ నుంచి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సిద్ధమవుతున్నాయి.

'ఈత'తో పాటు 'శక్తి శాలిని' చిత్రాలను నిర్మాణ సంస్థ రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ఇక 'ఛావా' తర్వాత విక్కీ కౌశల్‌తో 'మహావతార్' అనే మైథాలజీ చిత్రాన్ని మడాక్ ప్రొడక్షన్ హౌస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాత దినేష్ విజన్‌ కీలక అప్‌డేట్ ఇచ్చారు.

2027 జనవరి చివరి నుంచి 'మహావతార్' షూటింగ్‌ను ప్రారంభించి.. జూన్‌ నాటికి చిత్రీకరణను పూర్తి చేయనున్నట్లు దినేష్ విజన్‌ వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు

రాబోయే సినిమాలతో సత్తా చాటాలని భావిస్తోంది

వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో శ్రద్ధా కపూర్‌ నటిస్తున్న 'స్త్రీ 3' సినిమాపై కూడా దినేష్ విజన్‌ స్పష్టత ఇచ్చారు.

'స్త్రీ 3'ను 2028లో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

దీంతో ప్రస్తుతం వరుస విజయాల కోసం ఎదురుచూస్తున్న మడాక్ ఫిల్మ్స్‌.. రాబోయే సినిమాలతో మళ్లీ తన సత్తా చాటాలని చూస్తోంది.

ADVERTISEMENT