LOADING...
ఇండియన్ సినిమాపై బయోపిక్: రాజమౌళి సమర్పణలో వస్తున్న కొత్త ప్రాజెక్ట్ 
మేడ్ ఇన్ ఇండియా సినిమాను సమర్పిస్తున్న రాజమౌళి

ఇండియన్ సినిమాపై బయోపిక్: రాజమౌళి సమర్పణలో వస్తున్న కొత్త ప్రాజెక్ట్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 19, 2023
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. తాజాగా రాజమౌళి నుండి మరో కొత్త ప్రాజెక్టు వస్తుంది. అయితే దర్శకుడిగా కాదు, ఈసారి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా పేరుతో సినిమా రాబోతుంది. భారతీయ సినిమాపై బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మేరకు రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాలో చిన్నపాటి వీడియోను రిలీజ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజమౌళి ట్వీట్