
Mahakali : 'మహాకాళి' పోస్టర్ రివీల్.. డిఫరెంట్ అవతారంలో అక్షయ్ ఖన్నా
ఈ వార్తాకథనం ఏంటి
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం 'జై హనుమాన్' చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఆయన సృష్టిస్తున్న సినిమాటిక్ యూనివర్స్‌లో 'అధీర', 'మహాకాళి' సినిమాలు కూడా రూపొందుతున్నాయి. ఇటీవలే 'మహాకాళి' మూవీని అధికారంగా ప్రకటించారు. ఈ చిత్రానికి స్టోరీ ప్రశాంత్ వర్మ అందించగా, పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్య అప్డేట్ సెప్టెంబర్ 30, ఉదయం 10:08 గంటలకు వెల్లడించనున్నట్లు, సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు.
Details
పవర్ ఫుల్ లుక్ లో అక్షయ్ ఖన్నా
ఆ పోస్టర్‌లో అక్షయ్ ఖన్నా పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు. ఇప్పటికే అక్షయ్ ఖన్నా ఈ మూవీలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ, రిలీజ్ అయిన లుక్ ద్వారా ఇది అధికారంగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ లుక్‌లో అక్షయ్ ఖన్నా భయంకరమైన, డిఫరెంట్ అవతారంలో కనిపిస్తున్నారు. ఇంకా ఆయన విలన్ పాత్రలోనే ఉంటారో, లేదా మరేదైనా కీలక పాత్రలో ఉంటారో తెలియాల్సి ఉంది. గతంలో హీరోగా నటించినప్పటికీ పెద్ద గుర్తింపు పొందలేకపోయిన అక్షయ్, 'ఛావా' మూవీలో ఔరంగజేబ్ పాత్రలో అదరగొట్టిన తరువాత వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఆయన 'మహాకాళి' వంటి భారీ ప్రాజెక్ట్‌లో కూడా భాగం అయ్యారు.