
Mahesh Babu: 'ఈడీ' విచారణ రాలేను.. సమయం కోరిన మహేశ్‌బాబు
ఈ వార్తాకథనం ఏంటి
సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో హీరో మహేష్ బాబు విచారణకు రాలేరు. ఆయనకు షూటింగ్ వల్ల 28 ఏప్రిల్ రోజున విచారణకు హాజరు కాలేకపోతున్నానని, కొత్త తారీఖు కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశారు.
సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు వట్టినాగులపల్లిలో ప్రాపర్టీ ఎన్‌క్లేవ్‌లు ప్రారంభించాయి. వీటి కోసం కొనుగోలుదారులకు రూ.3.25 కోట్ల చొప్పున ఒప్పందాలు చేశారు.
అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్లు వసూలు చేసినా, ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో బాధితులు ఫిర్యాదు చేశారు.
సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు అక్రమ లావాదేవీలకు సంబంధించి 100 కోట్ల రూపాయలు మోసం చేశాయని ఆరోపణలు ఉన్నాయి.
Details
మహేశ్ బాబుపై ఆరోపణలు
ఈడీ 16 ఏప్రిల్ 2025న సంస్థల్లో సోదాలు చేపట్టి రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది.
మహేశ్‌బాబు సాయిసూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు. ఆయనకు రూ.5.9 కోట్ల చెల్లించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
మహేశ్‌ను విచారించడానికి ఏప్రిల్ 28న ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేశ్, తన పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్ల పాస్‌బుక్స్‌తో విచారణకు హాజరయ్యేలా సూచనలిచ్చింది.
అయితే రాజమౌళి దర్శకత్వంలో 'SSMB29' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేశ్, విచారణకు రాలేనని లేఖ రాశారు.