Page Loader
పుట్టినరోజు నాడు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు అందజేసిన సితార 
విద్యార్థులకు సైకిళ్ళు అందజేసిన సితార

పుట్టినరోజు నాడు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు అందజేసిన సితార 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 20, 2023
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఈరోజు తన 11వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళను అందజేసింది సితార. ఈ మధ్య ప్రఖ్యాత ఆభరణాల సంస్థ యాడ్ షూట్ లో పాల్గొంది సితార. అందులో వచ్చిన డబ్బును ఇలా సేవా కార్యక్రమాల కోసం వినియోగించింది. సైకిళ్ళను అందజేయడంతో పాటు అందరితోనూ ఫోటోలు దిగిన సితార, విద్యార్థుల సమక్షంలోనే కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకుంది. ఈ సెలెబ్రేషన్ తాలూకు వీడియోకు నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది. తండ్రి మహేష్ బాబు బాటలోనే సితార తన సేవా దృక్పథాన్ని చాటుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విద్యార్థులకు సైకిళ్ళు అందజేసిన సితార