Loading...
Mahebush babu: 'రణ్‌బీర్ నటనకు మహేశ్ ఫిదా.. ఇప్పుడు అందరి చూపు 'వారణాసి'పైనే!
'రామాయణ'పై మహేశ్ బాబు ప్రశంసలు.. 'వారణాసి'లో శ్రీరాముడిగా ఎలా మెప్పిస్తారో?

Mahebush babu: 'రణ్‌బీర్ నటనకు మహేశ్ ఫిదా.. ఇప్పుడు అందరి చూపు 'వారణాసి'పైనే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారీ అంచనాల మధ్య విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకున్న 'రామాయణ' చిత్రంపై సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. నితీశ్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా చూసిన అనంతరం మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో నటీనటుల అభినయంతో పాటు దర్శకుడి ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన కథలు వెండితెరపై ఇంత అద్భుతంగా ప్రాణం పోసుకోవడం చూడటం ఎంతో ఆనందంగా ఉందని మహేశ్ బాబు పేర్కొన్నారు. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవిల నటన మ్యాజికల్‌గా ఉందని కొనియాడారు.

వివరాలు

చిత్రబృందానికి అభినందనలు

ఈ భారీ చిత్రాన్ని రూపొందించిన నమిత్ మల్హోత్రా, నితీశ్ తివారీలకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఇంత భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు వారు చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొంటూ.. 'రామాయణ' చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలిపారు.

ఇప్పటికే విడుదలైన ఈ పౌరాణిక చిత్రంపై ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, అట్లీ ప్రశంసలు కురిపించారు.

తాజాగా మహేశ్ బాబు కూడా వారితో చేరడంతో సినిమాపై సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

అయితే మహేశ్ బాబు చేసిన ఈ పోస్ట్‌తో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆయన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' అనే సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వివరాలు

శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు

ఇందులో 'రామాయణం'కు సంబంధించిన ఎపిసోడ్ అత్యంత కీలకంగా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఓ ప్రత్యేక సీక్వెన్స్‌లో మహేశ్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం 'రామాయణ'లో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటనకు ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో.. అదే ఐకానిక్ పాత్రలో మహేశ్ బాబు ఎలా కనిపిస్తారు? తన నటనతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారు? అనే అంశాలపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

మహేశ్ బాబు 'రామాయణ' చిత్రంపై ప్రశంసలు కురిపించడంతో పాటు, ఆయన 'వారణాసి'లో పోషించనున్నట్లు ప్రచారంలో ఉన్న శ్రీరాముడి పాత్రపై కూడా అంచనాలు మరింత పెరిగాయి.

ADVERTISEMENT