Page Loader
ప్రేమ విమానం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చేస్తున్నాడు 
మహేష్ బాబు లాంచ్ చేయనున్న ప్రేమ విమానం టీజర్

ప్రేమ విమానం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చేస్తున్నాడు 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 26, 2023
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

అభిషేక్ పిక్చర్స్, జీ5 సంస్థలు సంయుక్తంగా ప్రేమ విమానం అనే వెబ్ ఫిలిమ్ ని తీసుకొస్తున్నారు. ఈ వెబ్ ఫిలిమ్ టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు వెబ్ ఫిలిమ్ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్, తన ట్విట్టర్ పేజీలో వెల్లడి చేసింది. ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 10:08గంటలకు టీజర్ లాంచ్ అవుతుందని తెలియజేసింది. ప్రేమ విమానం సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘనా హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంతోష్ కాటా డైరెక్ట్ చేసారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహేష్ బాబు లాంచ్ చేయనున్న ప్రేమ విమానం టీజర్