Varanasi: న్యూ ఇయర్ వెకేషన్‌కు మహేష్ బాబు.. ఎయిర్‌పోర్ట్‌లో వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' షూటింగ్ నుంచి కొద్దిరోజుల విరామం తీసుకున్న ఆయన, సోమవారం (డిసెంబర్ 29) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి సందడి చేశారు.
Details
స్టైలిష్ లుక్‌లో మహేష్
రాజమౌళి సినిమా కావడంతో వరుస షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న మహేష్ బాబు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కుటుంబంతో కలిసి విదేశీ ట్రిప్‌ను ప్లాన్ చేశాడు. సోమవారం ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన మహేష్ ఫ్యామిలీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లూ టీ-షర్ట్, బ్రౌన్ జాకెట్, జీన్స్‌తో పాటు తన ట్రేడ్‌మార్క్ క్యాప్, కళ్లజోడుతో మహేష్ బాబు స్టైలిష్‌గా కనిపించాడు. కూతురు సితార కూడా వైట్ టీ-షర్ట్, క్యాప్, కూలింగ్ గ్లాసెస్‌తో తండ్రిని పోలిన లుక్‌లో మెరిసింది. నమ్రత, గౌతమ్ చిరునవ్వులతో కనిపించారు.
Details
ఫోటోలు వైరల్
"ఏమున్నాడురా బాబు" అని కొందరు స్పందిస్తుంటే నువ్వు సృష్టించే విధ్వంసం కోసం వెయిటింగ్ అన్న అంటూ మరికొందరు 'వారణాసి' సినిమాను గుర్తు చేస్తున్నారు. రాజమౌళి సినిమాల ఆలస్యంపై ఓ నెటిజన్ సరదాగా స్పందిస్తూ... "కానియ్యి అన్న, ఎలాగో మళ్లీ ఆగస్టులోనే అప్‌డేట్ వచ్చేది" అంటూ సెటైర్ వేశాడు.
Details
'వారణాసి' సినిమా విశేషాలు
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్‌ను గత నవంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు 2024 నుంచే ప్రత్యేక శిక్షణ ప్రారంభించగా, 2025 జనవరి నుంచి షూటింగ్‌లో పాల్గొన్నారు. భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రూపొందుతున్న 'వారణాసి' 2027 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా, ఇటీవల మహేష్ బాబు క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.