LOADING...
Mahesh Babu: మా టీమ్‌పై ప్రేమ కురిపించిన నా అభిమానులు, మీడియా, ప్రతి ఒక్కరికీ థాంక్స్‌: మహేష్ బాబు పోస్టు
మా టీమ్‌పై ప్రేమ కురిపించిన నా అభిమానులు, మీడియా, ప్రతి ఒక్కరికీ థాంక్స్‌: మహేష్ బాబు పోస్టు

Mahesh Babu: మా టీమ్‌పై ప్రేమ కురిపించిన నా అభిమానులు, మీడియా, ప్రతి ఒక్కరికీ థాంక్స్‌: మహేష్ బాబు పోస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో మహేష్ బాబు ప్రధాన పాత్రలో, దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా 'వారణాసి'. శనివారం రాత్రి రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ చిత్ర టైటిల్‌ గ్లింప్స్‌ను ఘనంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌ తర్వాత మహేశ్‌బాబు సోషల్‌మీడియాలో కొత్తగా ఓ పోస్ట్‌ పెట్టారు. ''ఎక్కడెక్కడినుంచో ప్రయాణించి వచ్చి, మా సినిమా టీమ్‌పై ప్రేమ చూపించిన అభిమానులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక థ్యాంక్స్‌. అతి త్వరలోనే మరోసారి కలుద్దాం'' అని మహేశ్‌ సందేశం ఇచ్చారు. ఇదే సందర్భంగా 'వారణాసి' వీడియోను కూడా పంచుకున్నారు. ఇక వేడుకకు ముందు రోజు కూడా మహేశ్‌ ''ముందు ఇంకొన్ని ఈవెంట్‌లు ప్లాన్‌ చేశాం'' అని చెప్పిన విషయం అభిమానులకు తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 అతి త్వరలో మళ్లీ కలుద్దాం