మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆల్రెడీ రిలీజైన గ్లింప్స్ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంది. గతకొన్ని రోజులుగా గుంటూరు కారం షూటింగ్ పై అనేక వార్తలు వచ్చాయి. చిత్రీకరణ ఆలస్యం ఐపోతుందని, అనుకున్న తేదీన విడుదల కావడం కష్టమేనని అన్నారు. తాజా సమాచారం ప్రకారం, గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ రేపటి నుండి మొదలు కానుందని తెలుస్తోంది. హై యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారని అంటున్నారు. హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ ఏరియాలో జరిగే ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ఇతర ప్రధాన పాత్రల్లో నటించే అందరూ పాల్గొంటారట.
గుంటూరు కారం ఫీమేల్ మెయిన్ లీడ్ లో శ్రీలీల
ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో ప్రధాన హీరోయిన్ గా శ్రీలీల కనిపిస్తుందని సమాచారం. పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసినీ బ్యానర్ లో రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమాను ఎస్ రాధాకృష్న నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, 2024 జనవరి 13వ తేదీన రిలీజ్ అవుతుంది. గుంటూరు కారం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడు. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటేసాయి. మహేష్ బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా, రాజమౌళితో రూపొందబోయే సినిమా ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.